
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’. దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం విశేషం. మధు బాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి రియల్ టైమ్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు. అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో ఆధ్యంతం ఉత్కంఠగా సాగే డ్రామా ఇది. సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
‘‘తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవలోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంది. ట్విస్టులు, టర్నులతో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్. ఎమోషన్స్… అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు దర్శకుడు దయానంద్.
ఈ చిత్రంలో పాత్రలన్ని గ్రే షేడ్‌లో ఉంటాయట.