- Advertisement -

జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా, మలయాళీ బ్యూటీ గాయత్రి ఆర్.సురేష్, శీతల్ భట్ హీరోయిన్స్ గా ఒక యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ సినిమాకి “గంధర్వ” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం నుండి రెండవ పాట విడుదలైంది.
ధనుంజయ్, మోష్మి నేహా ఆలపించిన “కన్నులకే కానుకవే…. చిన్ని గుండెకే ఊపిరివే… వెన్నెలకే వెలుతురువే … గుండెలలో సవ్వడివే … “అన్న పల్లవితో సాగే ఈ పాటకి ర్యాప్ రాక్ షకీల్ సంగీత దర్శకుడు.
“గంధర్వ” చిత్రం ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది అంటున్నారు చిత్ర దర్శక, రచయిత అఫ్సర్ హుస్సేన్. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారట. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది ఈ మూవీని.
“గంధర్వ”లోని ఈ పాటని చూసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.