Bigg Boss Telugu 4 – Episode 2

బిగ్ బాస్ సీజన్-4 మొదటి రోజు పూర్తయింది. మొదటి రోజు కంటెస్టెంట్లకు కొన్ని తీపి గుర్తులతో పాటు.. చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. అప్పుడే హౌజ్ లో కొందరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. మనం నిన్ననే చెప్పుకున్నట్టు, ఊహించినట్టుగానే కొందరు ఏడుపులు అందుకున్నారు.
అయితే ఇవన్నీ పక్కనపెడితే.. బిగ్ బాస్ మాత్రం తన ఆట స్టార్ట్ చేశాడు. మొదటి రోజే ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టాడు.ఈ వీకెండ్ ఎలిమినేషన్ రౌండ్ కోసం 16 మందిలో ఏకంగా ఏడుగుర్ని బిగ్ బాస్ ఫైనల్ చేశాడు. అది కూడా బిగ్ బాస్ ఫైనల్ చేయలేదు.. ఇద్దరేసి చొప్పున నిలబెట్టి.. మిగతా వాళ్లనే అడిగి ఎలిమినేషన్ రౌండ్ కోసం ఏడుగుర్ని నామినేట్ చేశారు.
మొదటివారం ఎలిమినేషన్ రౌండ్ కు అభిజిత్, సూర్యకిరణ్, దివి, మెహబూబా, అఖిల్ సార్థక్, సుజాత, గంగవ్వ ఎంపికయ్యారు.
ALSO READ: ఆట మొదలైంది.. ఏడుపులు స్టార్ట్
నిజానికి గంగవ్వను ఎలిమినేట్ చేయాలని హౌజ్ మేట్స్ ఎవ్వరూ అనుకోలేదు. ఆమెకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది కాబట్టి.. హౌజ్ మేట్స్ ఎలిమినేట్ చేసినా ఆమె బయటకు వెళ్లదనే ధైర్యంతో అంతా కలిసి ఆమెను నామినేట్ చేశారు. ఇలా మొదటి రోజు బిగ్ బాస్ హౌజ్ కాస్త ఉత్సాహంతో, ఇంకాస్త ఉద్విగ్నంతో సాగింది.