నన్ను బయటికి పంపండి ప్లీజ్: గంగవ్వ

Gangavva

బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో గంగవ్వ ఒక స్టార్. ఆమెకి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిజానికి “బిగ్ బాస్” ఫార్మాట్ కి ఆమె మిస్ ఫిట్. ఆమె జీవనశైలి, ఆమె వయసు… ఈ షోకి అసలు లింక్ ఉండదు. కానీ యూట్యూబ్ లో ఆమెకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, దానికితోడు కంటెస్టెంట్ లలో వైవిధ్యం కోసం గంగవ్వని తీసుకున్నారు. ఐతే రెండో వీకెండ్ కి వచ్చేసరికి ఆమె ఆరోగ్యం చెడింది. ఇంటిమీద రంది (బెంగ) పెట్టుకున్నట్లుంది.

ఇక్కడ నేను ఉండను … ఇంటికి పంపించండి అని గంగవ్వ కోరుతోంది. మరి ఆమెని బిగ్ బాస్ టీం పంపించేస్తుందా? గతంలో సంపూ కూడా ఇలాగే “హౌజ్”లో సఫోకెట్ ఫీల్ అయ్యాడు.

59 ఏళ్ళ గంగవ్వ ఈ టీంలో సీనియర్ మోస్ట్ మెంబర్.

Related Stories