పుష్పకి, పుష్పకి ఎడం ఎందుకు?

Pushpa Teaser


అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాని రెండు భాగాలుగా తీయనున్నారనేది తెలిసిన మేటరే. ఐతే, ‘బాహుబలి’ సినిమాలా రెండు భాగాలు భారీ ఎత్తున విడుదల కానున్నాయి. కానీ, ‘బాహుబలి’ సినిమాలు రెండూ పూర్తి అయ్యేంత వరకు ప్రభాస్ మరో సినిమా చెయ్యలేదు. కానీ, అల్లు అర్జున్ మాత్రం అలా చెయ్యడం లేదు.

‘పుష్ప’ మొదటి భాగానికి, పుష్ప రెండో భాగానికి మధ్య ఎడం పాటిస్తాడంట. ఒకటి విడుదలైన తర్వాత ‘ఐకాన్’ అనే మరో సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత రెండో భాగం షురూ చేస్తాడట.

మధ్యలో గ్యాప్ ఎందుకంటే, దర్శకుడు సుకుమార్ రెండో భాగం కథని మరింత పకడ్బందీగా రాసుకునేందుకు టైం కావాలంట. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి రెండో పార్ట్ ని ఎలా తీయాలో ఆలోచిస్తాడు కాబోలు. ఈ గ్యాప్ లో బన్నీ ఇంకోటి డెలివరీ చేస్తాడన్నమాట.

More

Related Stories