
మొన్ననే పెళ్లి చేసుకున్నారు కాజల్-గౌతమ్. రీసెంట్ గా హనీమూన్ కూడా పూర్తిచేశారు. మొన్నటివరకు భర్తలో తనకు నచ్చిన అంశాల్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చింది కాజల్. ఇప్పుడు అతడిలో తనకు నచ్చని అంశం ఏంటో బయటపెట్టింది.
గౌతమ్ కు మొబైల్ పిచ్చి అంట. ఎప్పుడూ చేతిలో మొబైల్ పట్టుకొని ఏదో ఒకటి చూస్తుంటాడట. కొత్త ఫోన్ కనిపిస్తే కొనేస్తాడట. ఆ మొబైల్ పిచ్చిని అతడు తగ్గించుకుంటే బాగుంటుందని చెబుతోంది. అంతేకాదు.. టీవీ పెడితే ఇక దానికే అతుక్కుపోతాడట. ఎప్పుడూ రిమోట్ చేతిలో ఉండాల్సిందేనంటోంది. మొబైల్ లానే టీవీ విషయంలో కూడా అప్ డేట్ వెర్షన్ వస్తే కొనేస్తుంటాడట.
ఇలా గౌతమ్ లో తనకు నచ్చని విషయాల్ని బయటపెట్టింది కాజల్. అటు కాజల్ కు సంబంధించి తనకు నచ్చని అంశాన్ని బయటపెట్టాడు గౌతమ్. కాజల్ కు కొబ్బరినూనె అంటే చాలా ఇష్టం అంట. కానీ తనకు మాత్రం ఆ వాసన అంటేనే పడదంటున్నాడు గౌతమ్.