గౌతమ్ పదేళ్లుగా తెలుసు: కాజల్

పెళ్ళైన తర్వాత కాజల్ అగర్వాల్ అసలు విషయం బయటపెట్టింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో మూడు రోజుల క్రితం కాజల్ పెళ్లి అయింది. అందరూ అనుకుంటున్నట్లు రెండేళ్ల క్రితం వీళ్ల డేటింగ్ షురూ కాలేదు. పదేళ్లుగా గౌతమ్ తెలుసు అని చెప్తోంది.

“గౌతమ్ నాకు 10 ఏళ్ల నుంచి పరిచయం. 7 ఏళ్లుగా మా మధ్య స్నేహం బలపడింది. ఐతే, పెళ్లి చేసుకుందామని గౌతమ్ ముందుగా నాకు ప్రొపోజ్ చేశాడు. ఈ ఏడాది స్టార్టింగ్ లో పెళ్లి చేసుకుందామని అడిగాడు. ఆ ప్రొపోజల్ కోసమే వెయిట్ చేస్తున్నా. చాలా ఆనందం వేసింది. ఆ తర్వాత లాక్డౌన్ కావడంతో పెళ్లి ఆలస్యం అయింది,” అని తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.

Kajal Aggarwal with Gautam

బెస్ట్ ఫ్రెండ్ లవర్ కావడం, అతనే నా భర్త కావడం అదృష్టం అని మురిసిపోతోంది

Related Stories