బోయపాటి చిత్రంలో గౌతమి

Gautami

ఒకప్పుడు హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించిన గౌతమి ఇటీవల తల్లి పాత్రల వైపు వచ్చారు. ఆమె తాజాగా నటించిన చిత్రం.. ‘అన్నీ మంచి శకునములే’.

డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో ఆమె మీనాక్షి అనే పాత్ర పోషించారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాజేంద్రప్రసాద్ సరసన నటించిన గౌతమి ఈ సినిమాలో కూడా ఆయనకి భార్యగా నటించారు. ఐతే అప్పట్లో వీరు హీరో, హీరోయిన్లు. ఇప్పుడు హీరోకి తల్లితండ్రులు.

“డైరెక్టర్ నందిని రెడ్డి బంగారం. ఆమె మంచి మనసున్న డైరెక్టర్. స్వప్నగారు విషయానికి వస్తే ఒక గొప్ప నిర్మాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎక్సయిటింగా అనిపించింది. చూసినప్పుడు ప్రేక్షకులకు కూడా అదే అనిపిస్తుంది అని నమ్ముతున్నా,” అని అన్నారు గౌతమి.

తాజాగా బోయపాటి డైరెక్షన్ లో కూడా ఆమె నటిస్తున్నారట. “ఒక వెబ్ సిరీస్ పూర్తయింది. అమెజాన్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను,” అని తన కొత్త ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. ఇక ఆమె కూతురు ప్రస్తుతం ఫిలిం మేకింగ్ కోర్స్ చేస్తున్నారట.

Advertisement
 

More

Related Stories