పెళ్లి చేసుకున్న ప్రేమజంట


తమిళ యువ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మాంజిమా మోహన్ ఒకటయ్యారు. సోమవారం ఈ జంట భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు.

సోమవారం ఉదయం చెన్నైలో సాంప్రదాయబద్దంగా వీరి వివాహ వేడుక జరిగింది. మణిరత్నం, గౌతమ్ మీనన్, శరత్ కుమార్, సహా పలువురు యువ తమిళ హీరోలు, హీరోయిన్లు వీరి పెళ్లికి విచ్చేశారు.

మణిరత్నం తీసిన ‘కడలి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు గౌతమ్ కార్తీక్. ఒకప్పటి అగ్ర హీరో కార్తీక్ (సీతాకోక చిలుక, మౌనరాగం, అభినందన) కొడుకు గౌతమ్. తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లో నటించింది మాంజిమా. గత మూడేళ్ళుగా ఈ జంట ప్రేమించుకుంటోంది. ఇరువైపులా పెద్దల ఆశీర్వాదంతో ఈ రోజు వీరి పెళ్లి జరిగింది.

“నౌ అండ్ ఫరెవర్,” అంటూ తమ పెళ్లి ఫోటోలను ఈ జంట ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

 

More

Related Stories