గీత సమర్పణలో “నేనే వస్తున్నా”!

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త చిత్రం… ‘తెలుగులో నేనే వస్తున్నా’ అనే పేరుతో విడుదల కానుంది. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి నిర్మాత కలైపులి థాను.

ధనుష్, సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. తెలుగులో ఈ సినిమాని అగ్ర నిర్మాణ సంస్థ “గీతా ఆర్ట్స్” సమర్పిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలోనే విడుదలకానుంది.

ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. వైవిధ్యమైన సినిమాలకు ధనుష్ కేరాఫ్. అందుకే, తెలుగు వాళ్ళు అతని సినిమాలు చూస్తారు. ఈ సినిమాలో కూడా ధనుష్ ఒక విలక్షణమైన పాత్ర పోషించాడట.

నిర్మాత థాను కోరిక మేరకు సినిమా చూసి అల్లు అరవింద్ ఈ సినిమాని ప్రెజంట్ చేసేందుకు ఒప్పుకున్నారు.

 

More

Related Stories