‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ జోరు

- Advertisement -
Geethanjali 2

అంజ‌లి హీరోయిన్ గా నటించిన ‘గీతాంజ‌లి’ హారర్ కామెడీ చిత్రాల్లో ఒక ట్రెండ్ ని సృష్టించింది. కోన వెంకట్, నిర్మాత ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, అంజ‌లి కాంబినేషన్లో వచ్చిన ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. అంజలికిది 50వ సినిమా.

“గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది” పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌ లు నటిస్తున్నారు. వీరు మొదటి భాగంలో కూడా ఉన్నారు. ఇక కొత్తగా స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ జాయిన్ అయ్యారు. మలయాళ నటుడు రాహుల్ మాధ‌వన్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

శివ తుర్ల‌పాటిని ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తున్నారు. “ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణను పూర్తి చేశాం. ఊటీలో ఓ షెడ్యూల్‌ను చిత్రీకరించాల్సి ఉంది. ఆ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది,” అని నిర్మాతలు తెలిపారు.

“గీతాంజలి 2” వచ్చే ఫిబ్రవరిలో విడుదల కానుంది.

 

More

Related Stories