
వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గని’ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొంది. ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. కట్స్ కూడా లేవంట.
కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ‘గని’ ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని మేకర్స్ చెప్తున్నారు. మరోవైపు, ఫిబ్రవరి 25న వచ్చేందుకు ‘భీమ్లా నాయక్’ సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి, 25న భీమ్లానాయక్ వస్తాడా, గని వస్తాడా అనేది చూడాలి. రెండింట్లో ఎదో ఒకటే రిలీజ్ అవుతుంది.
సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇది ఒక బాక్సింగ్ డ్రామా. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అమెరికా వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. బాడీ పెంచుకున్నాడు.
సోలో హీరోగా పెద్ద హిట్ కొట్టాలని వరుణ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నం ఈ సినిమాతో ఫలిస్తుందా అనేది చూడాలి.