గని ఫిక్స్ చేసుకున్నాడు

- Advertisement -
Ghani

వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా గ‌ని’ అనేకసార్లు వాయిదా పడింది. కరోనా వేవ్స్ ఈ సినిమాకి అనేక అడ్డంకులు సృష్టించాయి. ఆ తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’ వంటి పెద్ద సినిమాల రాక కారణంగా డిసెంబర్ రేస్ నుంచి బయటపడాల్సి వచ్చింది. ఐతే, మొత్తానికి ఇప్పుడు ఈ మూవీకి ఒక డేట్ దొరికింది.

‘గని’ చిత్రాన్ని మార్చి 18, 2022న విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించిన ఈ మూవీ పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంగా సాగుతుంది. ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ అమెరికా వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నాడు. బాడీని మార్చేశాడు

బాలీవుడ్ భామ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర కీలక పాత్రలు పోషించారు ఇందులో.

జనవరిలో ‘ఆర్ ఆర్ ఆర్’, ఫిబ్రవరిలో ‘ఆచార్య’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలు వస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తమ సినిమాలు విడుదల చేసిన వెంటనే వరుణ్ తేజ్ లైన్లోకి వస్తున్నాడు.

 

More

Related Stories