
రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్” కన్నా ఎక్కువ సార్లు వాయిదా పడ్డ చిత్రం ఏదైనా ఉందంటే అది వరుణ్ తేజ్ నటించిన ‘గని’. ఇదేమి పాన్ ఇండియా సినిమా కాదు. కానీ, సరైన తేదీ కోసం అంటూ వెయిట్ చేస్తూ ఎప్పటికప్పుడు విడుదల తేదీ ప్రకటించడం, వాయిదా వేసుకోవడం జరుగుతోంది.
అసలైన కామెడీ ఏంటంటే… మంగళవారం ఉదయమే హడావిడిగా ఈ సినిమాకి ‘ఫైనల్’ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 25న వస్తున్నా అని వరుణ్ తేజ్ ఘనంగా ట్వీట్ చేశాడు. కానీ మంగళవారం రాత్రికి ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ఫిబ్రవరి 25న విడుదల అంటూ పోస్టర్ వదిలారు.
‘భీమ్లా నాయక్’ రాదనే ఉద్దేశంతోనే ‘గని’ డేట్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇంకో డేట్ చూసుకోవాలి. కుదిరితే మార్చి 4 లేదంటే మళ్ళీ ఎప్పుడు డేట్ దొరుకుతుందో చెప్పలేం. మే 27న వరుణ్ తేజ్ నటిస్తున్న “ఎఫ్ 3” విడుదల కానుంది. సో, ఏప్రిల్ లోపు అయినా రావాలి లేదంటే ఆ జూన్ లేదా జులైలో.
ఈ సినిమాకి నిర్మాతలు అల్లు అరవింద్ ఫ్యామిలీనే. వాళ్లే రిలీజ్ కి ఇంత ఇబ్బంది పడుతున్నారు.