డేట్ మారినా పోటీ తప్పదు!

Ginna


మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఈ సినిమా వాయిదా పడింది. మొన్నటివరకు అక్టోబర్ 5న వసున్నా అంటూ హడావిడి చేసిన విష్ణు ఇప్పుడు సినిమాని అక్టోబర్ 21కి వాయిదా వేశారు. దసరాకి చిరంజీవి, నాగార్జున సినిమాలు ఉండడంతో పోటీ నుంచి తప్పుకున్నారు విష్ణు.

సినిమా వాయిదా వెయ్యడం వరకు ఓకే. కానీ, ఎంచుకున్న కొత్త తేదీతో ఆయనకి చిక్కులే. ఆటోబర్ 21న ‘ధమాకా’, ‘ప్రిన్స్’, ‘ఓరి దేవుడా’ వంటి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా నలిగిపోతుంది. మరి, మంచు విష్ణు మరోసారి తన సినిమాని వాయిదా వేస్తాడా? లేదంటే సై అంటాడా అనేది చూడాలి.

ఈశాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్స్ గా నటించారు.

మరోవైపు, తనని ట్రోల్ చేసినా పట్టించుకోనని అంటున్నారు విష్ణు. కానీ, కావాలని తనపైన, తన కుటుంబంపైన బురద చల్లితే ఊరుకోను చెపుతున్నారు.

 

More

Related Stories