ఘట్టమనేని ఇంట్లో గణేశుడు!

Mahesh Babu house


ఈసారి పర్యావరణసహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు. వినాయక చవితి పండుగని ఇంట్లో ఘనంగా జరుపుకోవడమే కాదు నిమజ్జనం కూడా అలాగే చేశారు. మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి నిష్టగా పూజలు చేశారు.

అలాగే ఇంట్లోనే తొట్టిలో నీళ్లు పోసి నిమజ్జనం జరిపారు. గణేశుడి విగ్రహాల నిమజ్జనం జలవనరులు కాలుష్యం కాకూడదు అని హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. మహేష్ బాబు, నమ్రత సహజంగానే ప్రకృతి ప్రేమికులు. పర్యావరణాన్ని కాపాడుతూనే పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చని ఘట్టమనేని వారు నిరూపించారు. అభిమానులకు మంచి సందేశాన్ని ఇచ్చారు.

తమ ఇంట్లో గణేశుడి పండుగ ఇలా జరిగింది అంటూ నమ్రత ఒక చిన్న వీడియో గ్లిమ్ప్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగానే వేలల్లో లైకులు వచ్చాయి. ఈ సంబరాల్లో వారి పిల్లలు సితార, గౌతమ్ కూడా పాల్గొన్నారు.

ఈ కింది వీడియోని చూడండి.

 

More

Related Stories