ఇక ఆ టైపు బీచ్ లు వస్తాయా?

న్యూడ్ బీచ్, ఫ్రీ బీచ్, క్లాత్-ఫ్రీ బీచ్.. ఇలా పేరు ఏదైనా ఒంటిపై దుస్తుల్లేకుండా ఎంజాయ్ చేసే బీచ్ లకు ముద్దు పేర్లు ఇవి. అయితే ఇవి పూర్తిగా విదేశాలకు మాత్రమే పరిమితం. అమెరికాతో పాటు చాలా యూరోపియన్ దేశాల్లో న్యూడ్ బీచ్ లు ఉన్నాయి. ఇండియాలో మాత్రం ఇప్పటివరకు ఈ సంస్కృతి ఇంకా రాలేదు. తాజాగా జరిగిన రెండు ఘటనల్ని గమనిస్తే, గోవాలో కూడా ఇలాంటి బీచ్ లు ఏర్పాటుచేయాలనే ఉద్యమం ఊపందుకుంటుందేమో అనిపిస్తుంది.

మొన్నటికిమొన్న గోవాలో హాట్ బ్యూటీ పూనమ్ పాండే నగ్నంగా ఓ డ్యామ్ పై షూటింగ్ చేసింది. దాని కన్నా కొద్దీ రోజులకు ముందే అదే గోవాలో సీనియర్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ నగ్నంగా జాగింగ్ చేస్తున్న ఫొటోలు బయటకొచ్చాయి. ఈ రెండు ఉదంతాలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి.

వీళ్ల కేసుల సంగతి పక్కనపెడితే.. ఈ సంఘటనల తర్వాత గోవాలో కూడా అలాంటి న్యూడ్ బీచ్ ఒకటి ఉంటే బాగుంటుందనే వాదన సోషల్ మీడియాలో మొదలైంది. నిజంగా ఈ ఉద్యమం ఊపందుకుంటే.. దానికి పూనమ్, మిలింద్ నుంచి బాహాటంగా మద్దతు లభించడం ఖాయం. ఇండియాలోకి ఇప్పటికే దాదాపు అన్ని రకాల పాశ్చాత్య సంస్కృతులు (స్వలింగ వివాహాలతో పాటు) వచ్చేశాయి.

ఇప్పుడీ న్యూడ్ బీచ్ లు కూడా వచ్చేస్తే, గేట్లు ఎత్తేసినట్టే.

Related Stories