గాడ్ ఫాదర్ వసూళ్లు తక్కువే కానీ

Nayanthara in Godfather

చిరంజీవి హీరోగా నటించిన సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, దసరా కానుకగా నిన్న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. మలయాళం సినిమా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీకి దర్శకుడు మోహన్ రాజా చేసిన మార్పులు, టాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చాయి.

ఇక రెవెన్యూ విషయానికొస్తే, చిరంజీవి సినిమా కావడంతో గాడ్ ఫాదర్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. పైగా దసరా సీజన్ కూడా కావడంతో వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చాయి. గాడ్ ఫాదర్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు స్వయంగా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

నిజానికి చిరంజీవి గత సినిమాలతో పోల్చి చూస్తే, ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ తక్కువే. ఆచార్య సినిమాకు మొదటి రోజు ఏకంగా 53 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే నెగెటివ్ టాక్ కారణంగా, మూడో రోజుకే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయింది. గాడ్ ఫాదర్ విషయంలో ఆ ప్రమాదం లేదు.

అంతేకాదు, ఈ సినిమాని తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. ఎక్కువ రోజులు రన్ ఉండాలి అని ప్లాన్ వేశారు.

ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి, ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ సినిమా పుంజుకోవడం గ్యారెంటీ. పైగా వీకెండ్ కు ఇంకా టైమ్ ఉంది. బరిలో మరో సినిమా పోటీగా లేదు. సో.. గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్ అవ్వడం గ్యారెంటీ.

 

More

Related Stories