గాడ్ ఫాదరా? మోనార్కా?

BB3

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది కావొస్తోంది. మొదటి టీజర్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు. మరో రెండు నెలల్లోనే సినిమా విడుదల. దాంతో, బోయపాటికి ఇప్పుడు ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఎక్కువ టైం లేదు ఆలోచించుకోవడానికి.

ఈ సినిమాకి మొన్నటివరకు ‘మోనార్క్’ అనే టైటిల్ అనుకున్నాడు బోయపాటి. తాజాగా ‘గాడ్ ఫాదర్’ అనే పేరు వైపు మొగ్గు చూపుతున్నాడట. ఈ రెండింటిలో ఏది ఫిక్స్ చేస్తాడు అన్నది చూడాలి. ఏప్రిల్ మొదటివారంలో ఈ టైటిల్ ప్రకటన ఉంటుంది అనేది అభిమానుల మాట.

ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకొంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్ల షూటింగ్ జరుగుతోంది. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఆయన సరసన పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

More

Related Stories