
కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా ఇక విడుదలకు నోచుకోదా? గతేడాది లాక్డౌన్ టైంలో రిలీజ్ అంటూ హడావిడి జరిగింది. ఏడాది గడిచింది. రెండు నెలల క్రితం ఒక కొత్త డేట్ ప్రకటించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే నిన్న (జూన్ 4న) విడుదల అయ్యేది. కానీ, మరోసారి లాక్డౌన్ వచ్చి పడింది. దాంతో ఈ సినిమా నిర్మాతలు దీని గురించి మరో అప్డేట్ ఇవ్వలేదు.
ఈ టైంలో ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ఎందుకు ఆలోచించడం లేదో అనే డౌట్ వస్తుంది. గతేడాది, కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు (‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా) డైరెక్ట్ గా డిజిటల్ వేదికలపైనే విడుదలయ్యాయి. ఐతే, వాటికి సరైన రెస్పాన్స్ రాలేదు. అందుకే, ఈ సారి ఈ మూవీ విషయంలో మేకర్స్ జంకుతున్నారేమో.
నగేష్ కుకునూర్ తీసిన మొదటి తెలుగు మూవీ. ‘హైదరాబాద్ బ్లూస్’, ‘తీన్ దీవారే’, ‘ఇక్బల్’ వంటి మంచి సినిమాలు తీసిన డిఫెరెంట్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్.