‘సోలో’ ఓపెనింగ్స్ చెప్తున్నదేంటి?

Solo Brathuke So Better

“సోలో బ్రతుకు సో బెటర్” సినిమాకి బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి. 50 శాతం అక్యూపెన్సీ నిబంధనతో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అన్న విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తంగా ఆసక్తిగా ఎదురుచూసింది. దీనికి సూపర్ ఓపెనింగ్ రావాలని ఇండస్ట్రీలోని హీరోలు అందరూ కోరుకున్నారు. ప్రోమోట్ కూడా చేశారు.

ఫస్ట్ డే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగున్నర కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే దాదాపు రెండున్నర కోట్ల షేర్. ఈ కొవిడ్-19 టైములో ఇది చాలా పెద్ద అమౌంట్. అంటే… సినిమాకి వచ్చేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.

మొదటి రోజు… థియేటర్ల వద్ద కనిపించింది అంతా యూతే. ఫామిలీ ఆడియన్స్ ఇప్పుడిప్పుడే రాలేరు. ఐతే, సినిమా కూడా “చాలా బాగుండి” ఉంటే బాగుండు. మొదటి సినిమాగా ఇండస్ట్రీ అంతా సో.. సో సినిమాని వదిలింది.

జనాలని థియేటర్లకు రప్పించే హీరో, దర్శకుడు, హైప్ ఉన్న మూవీ ఉంటే జనం ఇప్పటికీ థియేటర్లకు వస్తారు. కానీ చిన్న సినిమాలుకు మాత్రం ఓపెనింగ్ రావడం కష్టమే. ఇదే ‘సోలో’ఓపెనింగ్ చెప్పింది.

కోవిడ్ పరిస్థితుల్లో విడుదలైన మొదటి మేజర్ మూవీ కాబట్టి దీనికి ఇండస్ట్రీ హైప్ ఇచ్చింది. సినిమా క్రిటిక్స్ కూడా ఈ సినిమాలోని లోపాలను చాలావరకు క్షమించి రివ్యూలు రాశారు. సాధారణ పరిస్థితుల్లో ఈ సినిమాకి దారుణమైన రేటింగ్స్ వచ్చేవి అనడంలో సందేహం లేదు. అది హెల్ప్ అయింది. మిగతా సినిమాలన్నింటికీ ఇది వర్తించదు.

More

Related Stories