మారుతిని అప్పు అడిగిన గోపీచంద్

తెలుగు సినిమా ప్రచారం కూడా కొత్త పంతులు తొక్కుతోంది. మొన్నటికిమొన్న తమ సినిమా ప్రచారం కోసం మేజర్ యూనిట్, ఏకంగా రిలీజ్ కు 3 వారాల ముందు నుంచే ప్రీమియర్స్ వేసింది. ఇప్పుడిలాంటిదే మరో డిఫరెంట్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది పక్కా కమర్షియల్ యూనిట్.

ఈ సినిమా కోసం ఇంటర్వ్యూ ఇచ్చాడు గోపీచంద్. తను ఎంత కమర్షియల్ అనే విషయాన్ని బయటపెట్టాడు. అయితే యూనిట్ లో మాత్రం ఎలాంటి కమర్షియాలిటీ లేదన్నాడు. దీనికి రుజువుగా ఓ ప్రాంక్ కాల్ చేశాడు గోపీచంద్. తను డబ్బులు అడిగితే ఎందుకు అని అడక్కుండా వెంటనే ఇచ్చే వ్యక్తి ఎవరనేది ఆ ప్రాంక్ కాల్ సారాంశం.

ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే, కెమెరా ముందే దర్శకుడు మారుతికి ఫోన్ చేశాడు గోపీచంద్. తనకు 10వేల రూపాయలు కావాలని అడిగాడు. ఎందుకు అని మారుతి అడిగితే గోపీచంద్ ఓడిపోయినట్టే. కానీ మారుతి అలా అడగలేదు. గోపీచంద్ ను అన్న అని సంబోధించిన మారుతి.. 10వేలు ఏంటి, 10 లక్షలు అడిగినా ఇస్తానంటూ ఫోన్ కట్ చేశాడు.

అలా కాల్ కట్ చేసిన సెకెన్ల వ్యవథిలోనే గోపీచంద్ ఎకౌంట్ లో 10వేల రూపాయలు పడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు.. 30-40 సెకెన్ల వ్యవధిలోనే గోపీచంద్ కరెన్సీ నోట్ల కట్టను లెక్కించే వీడియో కూడా వైరల్ అవుతోంది.

 

More

Related Stories