‘భీమా’పై డౌట్ లేదు: గోపీచంద్

Bhimaa

హీరో గోపీచంద్ విజయం అందుకొని చాలా కాలమే అయింది. మాస్ సినిమా చేసినా హిట్ దక్కలేదు. ఎంటర్టైన్మెంట్ మూవీ చూసినా సరియైన ఫలితం రాలేదు. దానితో ఈసారి “అఖండ” పద్దతిలో వెళ్తున్నారు.

గోపీచంద్ నటించిన కొత్త చిత్రం… భీమా. ఈ సినిమాకి కన్నడంలో మంచి విజయాలు చూసిన ఎ హర్ష దర్శకత్వం వహించారు. కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హన్మకొండలో జరిగింది.

ఈ సినిమా కచ్చితంగా ఆడుతుంది… ఇందులో డౌటే లేదు అని ఈ ఈవెంట్ లో పేర్కొన్నారు గోపిచంద్.

“.భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బావుటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పాను… కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నిర్మాత రాధమోహన్ గారికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయనే,” అని అన్నారు.

Advertisement
 

More

Related Stories