ఆ ఇద్దరికీ హీరోలు కావాలి!

ఆ ఇద్దరూ హిట్ కొట్టి ఖాళీగా కూర్చున్నారు. ఆ దర్శకులు ఎవరో కాదు బాబీ, గోపి. బాబీగా పిలవబడే కె.ఎస్.రవీంద్ర ఈ సంక్రాంతికి భారీ హిట్ అందుకున్నారు. ఆయన మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘వాల్తేర్ వీరయ్య’ అనూహ్య విజయాన్ని అందుకొంది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్ హిట్ గా అవతరించింది ‘వాల్తేర్ వీరయ్య’.

ఇక గోపీచంద్ మలినేని తీసిన ‘వీర సింహ రెడ్డి’ ఫలితం కూడా సేమ్. బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద హిట్ ఈ మూవీ. సంక్రాంతి బరిలో అటు బాలయ్య, ఇటు చిరంజీవి పోటీపడ్డారు. రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అందులో చిరంజీవి మూవీ మెగా హిట్. ఐతే బాలయ్యకి అంత పెద్ద హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, చిరంజీవికి బ్లాక్ బస్టర్ అందించిన బాబీ ఇప్పుడు హీరోల డేట్స్ కోసం నిరీక్షిస్తున్నారు.

పెద్ద హీరోలెవ్వరూ వీళ్లకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. పెద్ద హీరోలు పెద్ద దర్శకులతో రెండు, సినిమాలకు కమిట్ అయ్యారు.

ఇప్పుడు ఈ దర్శకులిద్దరూ ఎవరితో సినిమా తదుపరి సినిమా చెయ్యాలా అనే డైలామాలో ఉన్నారు.

 

More

Related Stories