హిట్టయినా గోపీచంద్ ఏడ్చాడట

Gopichand Malineni with Ravi Teja

డైరెక్టర్ గోపీచంద్ ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత తన సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చాయి. గోపీచంద్ తీసిన “క్రాక్” సినిమా మాస్ ఆడియన్స్ కి నచ్చింది. యాక్షన్ సీన్లు, మేకింగ్ విషయంలో మంచి మార్క్ చూపాడు. రామ్ చరణ్ వంటి పెద్ద హీరో కూడా సినిమాని, తన వర్క్ ని మెచ్చుకుంటూ ట్వీట్ వెయ్యడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.

ఈ సినిమా మేకింగ్ టైంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట. కరోనా వల్ల సినిమా విడుదల అవుతుందా లేదా అని టెన్షన్ తో ఏడుపు వచ్చిందట. ఈ విషయాన్నీ సంగీత దర్శకుడు తమన్ బయటపెట్టాడు. ఇక రిలీజ్ తర్వాత కూడా ఏడ్చాడట. కానీ ఈ సారి అవి ఆనంద భాష్పాలు.

డాన్ శీను, బలుపు, క్రాక్… ఇలా రవితేజకు మూడు హిట్లు ఇచ్చిన దర్శకుదిగా గోపీచంద్ మలినేని పేరు తెచ్చుకున్నాడు. ఐతే, ‘క్రాక్’ సంక్రాంతి పండగ తర్వాత ఎంత మేరకు నిలబడుతుంది. ఓవరాల్ దీని రేంజు ఏంటి అనేది చూడాలి. ‘క్రాక్’ ఆడకపోయి ఉంటే గోపీచంద్ మలినేని కెరీర్ కి ఇబ్బందే ఉండేది.

 

More

Related Stories