ఈసారి శృతిని వద్దనుకుంటున్నాడా?

Shruti Haasan

కొందరి దర్శకులు సెంటిమెంట్స్ బాగా పాటిస్తారు. దర్శకుడు గోపీచంద్ మలినేనికి శృతి హాసన్ తన అదృష్టదేవత అన్న భావన ఉంది. ఆయన సినిమాల్లో ఎక్కువగా ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. కానీ, ఈ సారి మాత్రం ఆమెని తన కొత్త సినిమాలో తీసుకోవట్లేదట.

గోపీచంద్ మలినేని ఇప్పటివరకు ఏడు సినిమాలు తీశారు. ఏడు చిత్రాల్లో మూడింటిలో శృతి హాసన్ నటించింది. “బలుపు” సినిమాలో శృతి హీరోయిన్. అది విజయం సాధించడంతో మళ్ళీ “క్రాక్”లో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు గోపీచంద్ మలినేని. అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత బాలయ్య హీరోగా తీసిన “వీర సింహా రెడ్డి”లో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

గోపీచంద్ రీసెంట్ గా తీసిన రెండు సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్. ఆమె తన లక్కీ మస్కట్ అని బహిరంగంగా ప్రకటించారు ఈ దర్శకుడు.

ఇప్పుడు ఆయన రవితేజ హీరోగా కొత్త చిత్రం ప్రకటించారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురు భామలను పరిశీలిస్తున్నారట. పూజ హెగ్డే సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే, ఇందులో శృతి హాసన్ పేరు లేదు. అంటే, ఈ సారి తన లక్కీ హీరోయిన్ ని రిపీట్ చెయ్యడం లేదు ఈ దర్శకుడు.

శృతి హాసన్ ప్రభాస్ సరసన ‘సలార్’లో నటించింది. ఈ సెప్టెంబర్ లో విడుదల కానుంది శృతి. ఇది కూడా హిట్టయితే ఆమెకి ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ దక్కుతుంది. ఈ సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’తో ఆమెకి విజయాలు దక్కాయి.

Advertisement
 

More

Related Stories