ఫ్యామిలీ బాటలో గోపీచంద్!

మహేష్ బాబుకి ఫ్యామిలీ స్టార్ అనే ఇమేజ్ ఉంది. ఆయన పిల్లల ఫోటోలు, ఆయన ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. ఎక్కువగా ఫ్యామిలీతో ఉన్న ఫొటోలే పెడుతుంటారు. ఆయన కన్నా జోరుగా మహేష్ బాబు భార్య నమ్రత, ఆయన కూతురు సితార ఇంకా ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. దాంతో, మహేష్ బాబుకి ఫ్యామిలీ స్టార్ అన్న ట్యాగ్ వచ్చింది.

మహేష్ బాబుని చూసి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా అదే పద్దతి ఫాలో అవడం మొదలు పెట్టారు. తారక్ కన్నా బన్నీ ఎక్కువగా ఈ పద్దతిలో ఉన్నారు. ఆయన భార్య స్నేహ కూడా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ స్టార్. ఇక అల్లు అర్జున్ తన కూతురు ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తారు.

వీరి బాటలో మరో హీరో వచ్చాడు. అతనే గోపీచంద్. తొట్టెంపూడి గోపీచంద్ కి స్క్రీన్ పై మేచో స్టార్ ఇమేజ్ ఉంది. కానీ, రియల్ లైఫ్ లో మాత్రం పార్టీలకు, హడావిడికి దూరంగా ఉండే స్టార్ అన్న పేరు ఉంది. ఈ హీరో కూడా ఇప్పుడు తన చిన్న కొడుకుతో ఫోటోషూట్ లు తీసుకొని షేర్ చేస్తున్నాడు.

మరోవైపు, గోపీచంద్ కెరీర్ ని చక్కదిద్దుకునే పనిలో కూడా ఉన్నాడు. ఆయన రీసెంట్ సినిమాలేవీ ఆడలేదు. ఇప్పుడు సక్సెస్ కోసం కొత్తగా వెళ్లాలనుకుంటున్నట్లు టాక్.

 

More

Related Stories