తమన్ పై మళ్ళీ అవే పుకార్లు!

- Advertisement -
Thaman


గత కొంతకాలంగా తమన్ ని తప్పిస్తున్నారని వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి. కానీ, అవి నిజం కాలేదు. మే 31న విడుదల అయ్యే ‘గుంటూరు కారం’ టైటిల్ వీడియోలో తమన్ పేరు ఉండదని వార్తలు వచ్చాయి. కానీ తమన్ పేరే కాదు అతని పాట కూడా ఆ వీడియోలో వుంది. ఆ గోల అంతా సద్దుమణిగింది అనుకుంటున్న టైంలో సడెన్ గా ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్ లో గోల.

తమన్ ని తీసేసి మరో సంగీత దర్శకుడిని తీసుకున్నారు అనేది కొత్త మాట.

జీవీ ప్రకాష్ కుమార్ కానీ అనిరుధ్ కానీ తమన్ స్థానంలో వచ్చినట్లు ప్రచారం మొదలైంది. దీనికి తగ్గట్లే నిర్మాత నాగవంశీ ఒక ట్వీట్ వేశారు. “రీ యునైటెడ్, రైవేటింగ్. బ్లాస్టింగ్ అప్డేట్ సూన్,” అని ట్వీట్ పెట్టారు. మళ్ళీ కలవడం అంటే అనిరుధ్ కాంబినేషన్ అని అనుకుంటున్నారు.

గతంలో త్రివిక్రమ్ – అనిరుధ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి పనిచేశారు. అది అట్టర్ ఫ్లాప్ కావడంతో త్రివిక్రమ్ తమన్ ని తీసుకున్నారు. ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురంలో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి వీరి కాంబినేషన్ లో. ‘గుంటూరు కారం’ సినిమాకి కూడా తమన్ నే తీసుకున్నారు త్రివిక్రమ్. కానీ, మహేష్ బాబుకి మొదటి నుంచి తమన్ ని తీసుకోవడం నచ్చలేదు.

మరి, ఈ కొత్త ప్రచారంలో నిజమెంతో. త్వరలో నిర్మాత ఇచ్చే ‘బ్లాస్టింగ్ అప్డేట్’తో క్లారిటీ వస్తుంది.

 

More

Related Stories