‘ఉస్తాద్ భగత్ సింగ్’లో గౌతమి

- Advertisement -
Gautami

పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తీస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రెండో హీరోయిన్ గా ఇంకా ఎవరూ ఎంపిక కాలేదు.

ఐతే, ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సీనియర్ నటి గౌతమి నటిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, గౌతమిలపై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ చిత్రీకరించారు. ఆమె హీరోకి తల్లిగా నటిస్తున్నట్లు అర్థమవుతోంది.

గౌతమి ఇటీవల పలు తెలుగు చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించారు. ఆమె నటిగా బిజీ కావాలనుకుంటున్నారు.

మరోవైపు, చెన్నైలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెని మోసం చేశాడట. దాదాపు పాతిక కోట్లు నష్టపోయాను అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాలను ఫోర్జరీ చేసి అతను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆమె ఆస్తులను లాగేసుకున్నాడట.

 

More

Related Stories