కరోనా నుంచి బయటపడ్డ గుణశేఖర్

Karri Gunasekhar

కరోనా వల్ల సినిమా సమంత సినిమా ఆగింది. సమంత హీరోయిన్ గా గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ లో కరోనా కలకలం రేగింది. ఎందుకంటే దర్శకుడు గుణశేఖర్ కి కరోనా పాజిటివ్ అని తేలడమే. ఐతే, ఆయనకీ రెండోసారి నెగెటివ్ అని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొద్దీ రోజల ఐసోలేషన్ తర్వాత మళ్ళీ షూటింగ్ షురూ అవుతుంది. సమంత కూడా షూటింగ్ ఆపేసింది. ఆమె ఈ వారాంతం నుంచి మళ్ళీ డేట్స్ ఇచ్చింది.

టాలీవుడ్ సినిమా షూటింగ్ లొకేషన్లు, ప్రెస్ మీట్లు, ఈవెంట్స్ … కరోనా స్ప్రెడ్ చేసే కేంద్రాలుగా మారాయి. గత 15 రోజుల్లో దాదాపు 100 మంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కొందరు సైలెంట్ గా ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకోగా, కొందరు ఆస్పత్రిలో చేరారు.

వేళ్ళమీద లెక్కపెట్టేంత సెలెబ్రిటీస్ మాత్రమే తమకు కరోనా వచ్చిన విషయాన్నీ బహిరంగ పర్చారు. మిగతావాళ్ళు సిగ్గుపడుతూ దాచిపెట్టుకొని, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వారితో కాంటాక్టులోకి వచ్చిన వారికి సమాచారం ఇవ్వకపోతే ఎలా.

More

Related Stories