
హీరోయిన్ శ్రీలీల ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదల చేసిన మాట వాస్తవమే కానీ ఆమెకి ఆనందాన్ని ఇచ్చిన చిత్రం ఒక్కటే. “భగవంత్ కేసరి” ఆమెకి మంచి పేరుని తెచ్చింది. మిగతా చిత్రాలన్నీ దారుణంగా పరాజయం పాలు అయ్యాయి. అంతే కాదు, ఆ పాత్రల వల్ల ట్రోలింగ్ ఎదుర్కొంది.
ఐతే, 2024 ఆమెకి కొంచెం బ్రైట్ గా మొదలయ్యేలా ఉంది. సంక్రాంతికి విడుదల కానున్న “గుంటూరు కారం” చిత్రంలో ఆమెని ఎలా చూపించాలో అలా చూపిస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. కుర్రకారు ఆమెని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ప్రెజెంట్ చేస్తున్నట్లు తాజాగా విడుదలైన “ఓ మై బేబీ” ప్రోమోతో అర్థమైంది.
పూజ హెగ్డేని టాప్ హీరోయిన్ గా చేసిన ఘనత త్రివిక్రమ్ దే. హీరోయిన్లను అందంగా చూపించడంలో త్రివిక్రమ్ శైలి వేరు.
“గుంటూరు కారం”లో కూడా కొంత గ్లామర్ ఘాటు ఎక్కువే అనిపిస్తోంది. సో, 2024 సంవత్సరాన్ని శ్రీలీల హిట్ తో శ్రీకారం చుట్టేలా ఉంది.

ALSO READ: Oh My Baby promo: Gurtettuko Gunturoste Panikostadi!
ఈ భామ ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాల్లో “గుంటూరు కారం”, “ఉస్తాద్ భగత్ సింగ్” మాత్రమే మిగిలి ఉన్నాయి. “ఉస్తాద్ భగత్ సింగ్” అసలు విడుదల అవుతుందా లేదా అన్నది డౌటే. సో, ఆమె ఇప్పుడు కొత్తగా మళ్ళీ సినిమాలు సైన్ చెయ్యాలి. “గుంటూరు కారం” రిజల్ట్ ని బట్టి ఆమె కెరీర్ మలుపు ఉంటుంది.