ఆ పాటతో షూటింగ్ సమాప్తం

Guntur Kaaram

మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తీస్తున్న “గుంటూరు కారం” షూటింగ్ ఆలస్యం అయినా మాట నిజమే. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రకరకాల రూమర్లు వచ్చాయి. ఐతే, మిగిలిన ఆ ఒక్క పాటని ఈ గురువారం నుంచి చిత్రీకరిస్తున్నారు.

నాలుగురోజుల్లో ఆ పాట షూటింగ్ పూర్తి అవుతుంది. అంటే క్రిస్మస్ పండగకి సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొడుతుంది అన్నమాట. సో, “గుంటూరు కారం” సినిమా జనవరి 12న కూల్ గా విడుదల కాగలదు. ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మహేష్ బాబు అభిమానులకు.

ఈ చివరి పాటలో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ కనిపిస్తుంది. ఆ హీరోయిన్ ఒక పేరొందిన తెలుగు హీరోయిన్. గురువారం ఆమె పేరుని ప్రకటిస్తారు.

తమన్ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమాకి. మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. అలాగే ఒక బిట్ సాంగ్ కూడా ఉంది. నాలుగు పాటల్లో రెండు పాటలు ఇప్పటికే బయటికి వచ్చాయి. మొదటి పాట “దమ్ మసాలా”కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో పాట “ఓ మై బేబీ” విషయంలోనే కొంత గొడవ జరిగింది. పాట బాగాలేదని మహేష్ బాబు అభిమానులు గోల చేశారు. కానీ అదిప్పుడు సర్దుకొంది.

Advertisement
 

More

Related Stories