‘గుంటూరు కారం’కి మరో దెబ్బ

Guntur Kaaram

మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తీస్తున్న “గుంటూరు కారం” సినిమా ప్రారంభం నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. హీరోయిన్ పూజ హెగ్డేని ఈ సినిమాని తొలగించారు. కథను మూడు సార్లు మార్చారు. రెండు నెలల పాటు షూటింగ్ కూడా ఆగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి మరో ఝలక్ తగిలింది.

ఈ సినిమాకి ఇప్పటివరకు పి.ఎస్. వినోద్ కెమెరావర్క్ అందించారు. కానీ ఆయన ఇప్పుడు తప్పుకున్నారట. త్రివిక్రమ్ గత రెండు చిత్రాలకు (అరవింద సమేత, అల వైకుంఠపురంలో) ఆయనే కెమెరామేన్. వరుసగా మూడో సినిమా పూర్తి చెయ్యాల్సిన వినోద్ ఇప్పుడు తప్పుకున్నారు అని టాక్. దానికి కారణమెంటో తెలియదు.

ఈ సినిమా విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ కి, హీరో మహేష్ బాబుకి మధ్య సరైన అవగాహన లేదనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. తమ మధ్య అంతా బానే ఉంది అంటూ టీం చెప్తోంది కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పుకార్లు నిజమే అని నమ్మాల్సి వస్తోంది.

త్రివిక్రమ్ తన సినిమా కన్నా పవన్ కళ్యాణ్ సినిమాలు, ఇతర చిత్రాల స్క్రిప్ట్ లపై ఎక్కువ ఫోకస్ పెట్టారనేది మహేష్ బాబు భావన. ఇక త్రివిక్రమ్ టీం మాట ఏంటంటే… మహేష్ బాబుకి భారీ పారితోషికం, విహార యాత్రల మీద ఎక్కువ ఫోకస్ తప్ప ఆయన పెద్దగా సినిమా కోసం కష్టపడట్లేదు అనేది.

మొత్తమ్మీద అటు మహేష్ బాబు, ఇటు త్రివిక్రమ్ “తప్పక” ఈ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా “గుంటూరు కారం” షూటింగ్ మరోసారి బ్రేక్ తీసుకొంది.

Advertisement
 

More

Related Stories