షురూ కానున్న భారీ ప్రమోషన్

Guntur Kaaram song

“గుంటూరు కారం” షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ అవుతోంది. డిసెంబర్ రెండో వారం కానీ, మూడో వారం కానీ మొత్తం షూటింగ్ కి గుమ్మడికాయ కొడుతారు. సంక్రాంతి పండగకు వస్తున్న భారీ చిత్రం ఇది.

ఈ సినిమా నిర్మాతలు ఇప్పటికే ఒక పాట విడుదల చేశారు. రెండో పాట త్వరలోనే విడుదల కానుంది. ఈ పాటతో పబ్లిసిటీ క్యాంపెన్ మొదలవుతుంది.

మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ మీద అనుమానాలు ఉండేవి. సంక్రాంతి లోపు మొత్తం పనులు పూర్తి చేసుకుంటుందా అన్న సందేహాలు అందరిలో కలిగాయి. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మరో 20 రోజుల్లో అంతా పూర్తి అవుతుంది. సో, టీంకి ప్రచారానికి కావాల్సినంత టైం దొరుకుతుంది.

మొదటి పాట ఇప్పటికే మంచి స్పందన పొందింది. ఐతే ఇకపై వచ్చే పాటలే ఎక్కువగా జనాలను ఊపేస్తాయి అని అంటున్నారు మేకర్స్. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి నటిస్తున్న “గుంటూరు కారం” జనవరి 12న విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories