మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న జ్వాల

vishnu vishal gutta jwala

గుత్తా జ్వాల మరో పెళ్లికి రెడీ అయింది. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న తమిళ నటుడు విష్ణు విశాల్ ను ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఈరోజు వీళ్లిద్దరి నిశ్చితార్థం సింపుల్ గా జరిగిపోయింది. ఈ విషయాన్ని నటుడు విష్ణు విశాల్ పరోక్షంగా వెల్లడించాడు.

ఈరోజు గుత్తా జ్వాల తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా రాత్రి ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు విశాల్. అదే టైమ్ లో ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. అలా వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ పూర్తయింది.

అర్థరాత్రి వేళ హుటాహుటిన తమ కోసం ఉంగరం తీసుకొచ్చిన గుత్తా జ్వాల మేనేజర్ కు థ్యాంక్స్ చెప్పాడు విష్ణు విశాల్. దానికి స్పందిస్తూ గుత్తా జ్వాల మేనేజర్ కంగ్రాట్స్ కూడా చెప్పడంతో.. వీళ్లిద్దరూ సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారనే విషయం బయటపడింది. తామిద్దరం ప్రేమలో ఉన్నామనే విషయాన్ని అటు జ్వాల, ఇటు విష్ణు ఇదివరకే నిర్థారించిన సంగతి తెలిసిందే.

Related Stories