- Advertisement -

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన “బీస్ట్” సినిమాలో “అరబిక్ కుతు” పాట బాగా వైరల్ అయింది. తన స్వర రచనలోనే అనిరుధ్ పాడిన ఆ పాట తమిళనాట సెన్సేషన్. ఇప్పుడు తెలుగు వర్షన్ పాట వచ్చింది.
తెలుగులో ఆ కిక్కు లేదు. తమిళ పాటకు యధావిధిగా అనువాదం చేశారు. కానీ, ఆ లిరిక్స్ లో దమ్ములేదు. తమిళ్ వర్సన్ లో ఉన్న ‘ఎనర్జీ’ లేదు. మరీ పేలవంగా ఉంది. తమిళ పాట వినని వాళ్లకు తెలుగులో బాగుంటుందేమో. లిరిక్స్ ని కాస్తయినా తెలుగు పద్దతిలో రాసి ఉంటే బాగుండేది.
“పిత్తా పిత్తా” అనేది తెలుగులో ఎబ్బెట్టుగా ఉంది.
విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ ‘బీస్ట్’ ఈ నెల 13న విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు అందిస్తున్నారు.