అతనితో లవ్వు గివ్వు లేదు: హమీదా

Hamida


‘బిగ్ బాస్’లో లవ్ ట్రాకులు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ లో హమీదా, శ్రీరామచంద్ర మధ్య అలా రొమాన్స్ సాగినట్లు కనిపించింది. ‘బిగ్ బాస్ తెలుగు 5’లో అడుగుపెట్టేంతవరకు హమీదా గురించి ఎవరికీ అంతగా తెలియదు. హౌజ్ లో ఆమె ఎక్కువగా ఇండియన్ ఐడల్ ఫేమ్ శ్రీరామచంద్రతో క్లోజ్ గా ఉంది. అతనితోనే ఎక్కువ టైం ఉంది. దాంతో టాస్కులు సరిగ్గా చెయ్యలేకపోయింది.

గతవారం ఎలిమినేట్ అయి బయటికి వచ్చింది హమీదా. ఐతే, శ్రీరామచంద్రతో లవ్వు గివ్వు అంటూ ఏమి చెయ్యలేదు అని తెలిపింది. మంచి స్నేహితులంగా మారాం తప్ప మరోటి కాదు అని చెప్తోంది. ఒక బాండ్ మాత్రం ఏర్పడిందట.

ఇంతకుముందు ఈ భామ తెలుగులో మూడు చిన్న సినిమాల్లో నటించింది. ఇప్పుడు మంచి అవకాశాల కోసం చూస్తోంది. ‘బిగ్ బాస్’ వల్ల వచ్చిన పాపులారిటీ తన కెరీర్ కి ఉపయోగపడుతుందని భావిస్తోంది. గ్లామర్ పాత్రలకు రెడీ అని చెప్తోంది.

గత సీజన్ లో పాపులర్ అయిన దివి, అరియనా వంటి ముద్దుగుమ్మలు ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయ్యారు. మరి హమీదా కూడా అలాంటి లక్ ఉందా అనేది చూడాలి.

 

More

Related Stories