
హీరోయిన్ హంసానందిని క్యాన్సర్ ని జయించే దిశగా వెళ్తోంది. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకోవడం ఖాయం. ఇప్పటికే ఆమె 16 సార్లు కీమో థెరపీ చేయించుకొంది. కీమో సర్వైవర్ (విజేత)ని అంటూ ఆమె ఆనందంగా ప్రకటించుకొంది.
మిర్చిలాంటి ఘాటైన అందం అంటూ అభిమానులతో పిలిపించుకున్న హంసానందిని ఇటీవల క్యాన్సర్ బారిన పడింది. బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కాగానే కుంగిపోకుండా పాజిటివ్ దృక్పథంతో పోరాడడం మొదలు పెట్టింది. గుండు చేయించుకొని క్యాన్సర్ చికిత్సకి సిద్ధమైంది. ధైర్యంగా ఆమె ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోటోలను షేర్ చేస్తూ తాను కోలుకుంటున్నట్లు చెప్పింది. క్యాన్సర్ పూర్తిగా తగ్గలేదు కానీ ఆమె కీమో నుంచి బయటపడింది. అంటే, ఇక ఆమెకి ఇక కీమో థెరపీ అవసరం లేదు. మందులతో చికిత్స కొనసాగించాలి.
వంశీ తీసిన ‘అనుమానాస్పదం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హంసానందిని అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. “ఈగ”, “అత్తారింటికి దారేది”, “మిర్చి” “సోగ్గాడే చిన్ని నాయన”, “లెజెండ్” వంటి పెద్ద సినిమాల్లో కూడా కనిపించింది.