
ఒకప్పుడు తెలుగులో ఎంతో బిజీగా ఉన్న హన్సికకి ఇప్పుడు క్రేజ్ లేదు. అంతే కాదు, ఇటీవలే పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయింది. ఇక ఆమె సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపదు అనుకున్నారు. కానీ, ఆమె ఇప్పుడు ఇంకా ఎక్కువ అవకాశాలు కావాలని కోరుకుంటోంది.
తెలుగులో మళ్ళీ ఆఫర్లు ఇస్తే తన సత్తా ఏంటో చూపుతాను అంటోంది. ఆమె అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
హన్సిక పెళ్లి తర్వాత కొంత బొద్దుగా మారింది. ఆ మధ్య బాగా స్లిమ్ అయి మునుపటి గ్లామర్ పోగొట్టుకొంది. ఇప్పుడు కొంత బొద్దుగా మారి మెరిసిపోతోంది. ఐతే ఆమెకి ఇప్పుడు అవకాశాలు రావడం అంత సులువు కాదు.
32 ఏళ్ల హన్సిక తెలుగులో దాదాపు పెద్ద హీరోలందరి సరసన నటించింది. ఆమెకి వారి సరసన ఆఫర్లు రావడం కష్టం. యువ హీరోలు ఆమెతో నటించే అవకాశం లేదు. సో, ఆమె నాగార్జున, రవితేజ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సరసన నటించే ఆలోచన చెయ్యాలేమో అవకాశాలు వెంటనే రావాలంటే.