- Advertisement -

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో, ఒక్క కట్ లేకుండా రూపొందుతోన్న మూవీ… 105 మినిట్స్. ఇందులో హన్సిక హీరోయిన్. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” అనేవి ఈ చిత్రానికి హైలైట్స్.
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. షూటింగ్ మొత్తం పూర్తియిపోయింది.
హన్సిక పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా “105 మినిట్స్” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబి విడుదల చేశారు. బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు.