‘నార్త్ మార్కెట్’పై హనుమాన్ ధీమా

Hanuman

“హనుమాన్” ఒక విధంగా చెప్పాలంటే చిన్న చిత్రమే. కానీ కేవలం టీజర్ తో పెద్ద సినిమా అయింది. “హనుమాన్” టీజర్ విడుదల కాగానే హిందీ మార్కెట్ నుంచి ఎంక్వరీలు మొదలయ్యాయి. దాంతో, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి నార్త్ ఇండియన్ మార్కెట్ లో భారీగా క్రేజ్ ఉంటుందని గ్రహించి సినిమా విడుదల తేదీని 8 నెలలు పోస్ట్ పోన్ చేశారు. చిన్న సినిమాని పెద్ద సినిమాగా మలిచేందుకు అంత గ్యాప్ తీసుకున్నారు.

ఈ నెల 12న తెలుగు, తమిళం, హిందీ, ఇలా అనేక భాషల్లో విడుదల కానుంది. ఐతే, అసలు ఫోకస్ మాత్రం తెలుగు, హిందీ మార్కెట్లే. ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్ పై టీం “హనుమాన్” చాలా ధీమాగా ఉంది.

ఇప్పటికే ఇండియాలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మూడ్ మొదలైంది. నార్త్ ఇండియాలో “రామ్ మందిర్” అనేది ఒక భావోద్వేగ అంశం. అందుకే, “హనుమాన్” చిత్రంకి నార్త్ ఇండియాలో బాగా క్రేజ్, డిమాండ్ ఉంటుంది. బయ్యర్లు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు.

“కార్తికేయ 2” తర్వాత ఏ తెలుగు చిన్న/మధ్యస్థ చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఆడలేదు. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో రీసెంట్ తెలుగు సినిమాలు పెద్దగా ఏవీ సందడి చెయ్యలేదు.

“హనుమాన్” నార్త్ ఇండియన్ మార్కెట్ లో మరో “కార్తికేయ 2” అవొచ్చు అని అంటున్నారు.

Advertisement
 

More

Related Stories