అదంతా ఉత్తదే

Hari Hara Veera Mallu

ఈ మధ్య ప్రతి పెద్ద సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది అన్న ప్రచారం ఎక్కువైంది. దర్శక, నిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా సోషల్ మీడియా జనం ఊదరగొడుతున్నారు. అలాంటి హడావిడే జరిగింది ‘హరి హర వీర మల్లు’ చిత్రం విషయంలో.

ఐతే, ఇదంతా ఉత్తదే అని తాజాగా రూఢి అయింది. పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్ లో ఒప్పుకున్న సినిమా షూటింగ్ పూర్తి చెయ్యడమే కష్టం. ఇక ఒక సినిమాని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తే అంతే సంగతులు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు ‘హరి హర వీర మల్లు’, అటు తన రాజకీయ పార్టీ కలాపాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు, వచ్చే వారం ఇంకో సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు. ‘వినోదయ సితం’ రీమేక్. ఇది తక్కువ రోజుల్లో పూర్తి అయ్యే చిత్రం. ఈ సినిమా కోసం ప్రస్తుతం బరువు తగ్గుతున్నారు.

ఇవి రెండు కాకుండా హరీష్ శంకర్ తీసే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ దర్శకత్వంలో రూపొందే ‘ఓజీ’ కూడా ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్ లు మొదలు కాలేదు కానీ ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇన్ని ఉండగా, ‘హరి హర వీర మల్లు’ రెండో పార్ట్ గురించి ఆలోచన ఉంటుందా?

Advertisement
 

More

Related Stories