‘హరిహర వీరమల్లు’కే ఓటు

Pawan Kalyan


పవన్ కళ్యాణ్ – క్రిష్ డైరెక్షన్లో రూపొందుతోన్న పీరియడ్ డ్రామాకి చాలా పేర్లు పరిశీలించారు. మొదట అనుకున్న పేరు….’విరూపాక్ష’. ఆ తర్వాత ‘బందిపోటు’. తర్వాత ‘హర మహాదేవ్’. ఈ మూడు పేర్లు ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేశారు. రిజిస్టర్ చెయ్యకుండా మరికొన్ని పేర్లు కూడా అనుకున్నారు. ఐతే, చివరికి, ‘హరిహర వీరమల్లు’ అనే పేరుకే ఓటేశారు.

అందుకే ఈ సినిమా టైటిల్ ని శివరాత్రి పర్వదినాన ప్రకటిస్తున్నారు. క్రిష్ చివరి నిమిషం వరకు సస్పెన్స్ లో పెట్టాడు. కానీ ఇప్పటికే ఫ్యాన్స్ ఈ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. సంక్రాంతి 2021కి విడుదల కానుంది ‘హరిహర వీరమల్లు’.

More

Related Stories