గబ్బర్ సింగ్ ని మించి ఉంటుందట!

గబ్బర్ సింగ్ ని మించి ఉంటుందట!

హరీష్ శంకర్ కెరీర్లో ఒక మైలురాయి…గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కి కూడా ఆ సినిమా ఒక మంచి మలుపు. వీరి కాంబినేషన్లో మరోసారి సినిమా రానుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాని ప్రకటించి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. ఐతే, పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్’ రీమేక్, క్రిష్ సినిమా అంటూ హరీష్ శంకర్ సినిమాని వాయిదా వేస్తూ వస్తున్నాడు. దాంతో ఒక దశలో ఈ సినిమా ఉంటుందా అన్న డౌట్స్ కూడా రైజ్ అయ్యాయి.

ఐతే, హరీష్ శంకర్ ఇవేవి పట్టించుకోకుండా స్క్రిప్ట్ పైనే దృష్టి నిలిపి సైలెంట్ గా తన పని చేసుకుంటున్నాడు. ఇప్ప్పుడు ఈ సినిమా గురించి నిర్మాతలు పెదవి విప్పారు. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’కి మించిన స్క్రిప్ట్ రెడీ చేశాడని అంటున్నారు. వినోదం, మెస్సేజ్ రెండూ కలిసిన సినిమా అవుతుందని చెప్పారు.

ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. హరీష్ శంకర్ ఇటీవల ‘గద్దలకొండ గణేష్’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఐతే, పవన్ కళ్యాణ్ తో మళ్ళీ బ్లాక్ బస్టర్ అందిస్తే… హరీష్ శంకర్ గ్రాఫ్ మరింతగా పెరుగుతుంది.

More

Related Stories