ముహుర్తాలు చూస్తోన్న హరీష్

- Advertisement -


పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించి చాలా కాలమే అవుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఓపిగ్గా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం.

తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభవోత్సవానికి ఒప్పుకున్నారు. త్వరలోనే లాంచ్ కానుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ ముహుర్తాలు చూసే పనిలో ఉన్నారు.

‘భీమ్లా నాయక్’ ఈ నెల 25న విడుదల కానుంది.

ఆ తర్వాత కొన్ని వారాల పాటు రాజకీయాలతో బిజిగా ఉంటారు పవన్ కళ్యాణ్. మార్చి మూడోవారం నుంచి ‘హరి హరి వీరమల్లు’ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ గ్యాప్ లోనే హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా లాంచ్ అవుతుంది. ఐతే, రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం ఇంకా చాలా టైముంది.

పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డేని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆమె డేట్స్ దొరికే అవకాశాన్ని బట్టి ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు.

 

More

Related Stories