రవితేజతోనూ నిరీక్షణ తప్పదు!

- Advertisement -
Harish Pawan Raviteja

దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదలుపెట్టారు. షూటింగ్ మొదలుపెట్టింది ఈ ఏడాదే. ఐతే, దీనికోసం రెండేళ్లుగా నిరీక్షించారు. ఇక ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు విడుదల అవుతుందో కచ్చితంగా చెప్పలేం. కనీసం మరో ఏడాది కాలం అయినా పడుతుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలోకి రావడానికి.

ఈ సినిమా విషయంలో చేసిన తప్పు మళ్ళీ చెయ్యకూడదు అనే ఉద్దేశంతో తదుపరి చిత్రం విషయంలో ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన మొదటి హీరో రవితేజతో ఒక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు హరీష్ శంకర్. రవితేజ హరీష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐతే, ఇక్కడ ఒక సమస్య ఉంది.

రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర రావు’ (అక్టోబర్ 20, 2023 విడుదల), ‘ఈగిల్’ (సంక్రాంతి 2024 విడుదల) పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీనికితోడు కొత్తగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నారు. ఇది మరో నెలలో షూటింగ్ మొదలు పెడుతుంది. ఈ మూవీ 2024 వేసవి సెలవుల్లో కానీ ఆ తర్వాత కానీ థియేటర్లలోకి వస్తుంది.

ఈ మూడు చిత్రాలు కాకుండా ఇంకా కొత్తగా రవితేజ మరో రెండు చిత్రాలు ఒప్పుకున్నారు. ఆ రెండూ పూర్తి అయ్యాకే హరీష్ శంకర్ కి అవకాశం ఇవ్వగలరు రవితేజ. అంటే హరీష్ శంకర్ కి రవితేజ విషయంలో కూడా నిరీక్షణ తప్పదు.

More

Related Stories