
దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితి విచిత్రంగా తయారైంది. హీరో పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం రెండేళ్లు నిరీక్షించి మొత్తానికి సినిమా మొదలు పెట్టారు హరీష్. కానీ, ఎన్నికల హడావుడితో ఆ సినిమా ఆరు నెలల పాటు ఆగిపోయేలా ఉంది. మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి. ఇది హరీష్ శంకర్ డైలమా .
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు ఎలాంటి షూటింగ్ లు పెట్టుకునే ఆలోచనలో లేరు పవన్ కళ్యాణ్. “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ ఇప్పటివరకు రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకొంది. కానీ, మిగతా భాగం చిత్రీకరణ ముందుకెళ్ళేలా లేదు.
మే, జూన్ వరకు పవన్ కళ్యాణ్ షూటింగ్ ల్లో పాల్గొనకపోతే హరీష్ శంకర్ అప్పటివరకు ఖాళీగా ఉండాలి. ఈ గ్యాప్ లో ఏమి చెయ్యాలి? రవితేజతో ఒక సినిమా చేసుకోవడమా లేక వేరే ఏదైనా ప్లాన్ చెయ్యడమా? అనే డైలమా ఉంది.
రవితేజ హీరోగా హరీష్ శంకర్ సినిమా జనవరి నుంచి మొదలవుతుంది అని ఇటీవల కథనాలు వచ్చాయి. కానీ హరీష్ శంకర్ ఆ వార్తలు తప్పు అని చెప్పారు. మరి హరీష్ శంకర్ ప్లాన్ ఏంటో.