
పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ తీద్దామనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ ఇప్పట్లో సెట్ కెళ్లేలా లేదు. పవన్ కళ్యాణ్ దసరా నుంచి రాజకీయ పర్యటనలు మొదలుపెడుతున్నారు. సో, హరీష్ శంకర్ సినిమా మరింత ఆలస్యం కానుంది. ఇది పక్కా.
మరి, మూడేళ్ళుగా నిరీక్షిస్తున్న హరీష్ పరిస్థితి ఏంటి? పక్క చూపులు చూడాల్సిందేనా? దానికి సమాధానం అవుననే చెప్పాలి. ఇప్పుడు ఏ హీరో డేట్స్ ఇవ్వగలడో చూసుకొని అటువైపు వెళ్లాల్సిందే.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే తీస్తానని హరీష్ కి ఆలోచన ఉండొచ్చు. కానీ, అభిమానిలా కాకుండా దర్శకుడిగా ఆలోచిస్తే ఆయన కెరీర్ లో లాంగ్ గ్యాప్ రాకుండా ఉంటుంది. దర్శకుడిగా ఏడాదికి ఒక సినిమా తీసినా సులువుగా ఎనిమిది, తొమ్మిది కోట్లు తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ తో ‘భగత్ సింగ్’ తీసేందుకు ఇంకా వెయిట్ చేస్తే సంపాదన ఉండదు. ఇప్పటికే రెండేళ్లు వేస్ట్ అయింది.
సో… హరీష్ శంకర్ తన కొత్త సినిమా గురించి త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వొచ్చు అని అంటున్నారు.