బాలయ్య కొట్టడంపై హీరో వివరణ

కార్తీక సోమవారం సందర్భంగా “సెహరి” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయడానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు నటుడు బాలయ్య. ఆ సందర్భంగా ఆయన తనదైన స్టయిల్ లో కాస్త హంగామా చేశారు. పాకెట్ లోంచి మొబైల్ ఫోన్ తీసేసి విసిరేశారు. సినిమాను ప్రేమించండి కానీ లవ్ చేయొద్దంటూ కన్ఫ్యూజ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. హీరోను వర్జిన్ అంటూ పొగిడారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన ఓ పని మరింత వైరల్ అయింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న టైమ్ లో ఆ పోస్టర్ పై హీరో కూడా ఓ చేయి వేస్తే, ఆ చేతిని బాలయ్య కొట్టడం కెమెరా కంటపడింది. బాలయ్య హీరో చేతిని కొట్టిన వీడియో నిమిషాల్లో వైరల్ అయింది. దీనిపై సదరు యంగ్ హీరో హర్ష వివరణ ఇచ్చాడు.

బాలయ్య తన చేతిపై కొట్టడాన్ని వివాదాస్పదం చేయొద్దంటున్నాడు హర్ష. తను ఎడమ చేత్తో పోస్టర్ ను పట్టుకున్నానని, దానికి కోపగించిన బాలయ్య తన చేతిపై కొట్టారని.. ఆ తర్వాత కొద్దిసేపటికి తను కుడిచేత్తో పోస్టర్ పట్టుకున్నానని వివరణ ఇచ్చాడు.

Related Stories