‘అవును’ అతనికి కరోనొచ్చింది!

- Advertisement -
Harshavardhan Rane

‘అవును’ వంటి సినిమాల్లో నటించిన హర్షవర్ధన్ రానేకి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ హీరో ఇప్పుడు బాలీవుడ్ లో స్థిరపడ్డాడు. ముంబైలోనే ఉంటున్నాడు. ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇప్పుడు ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడ

హర్షవర్ధన్ రానే తెలుగులో ‘అవును’తో పాటు ‘ఫిదా’, ‘తకిట తకిట’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’, ‘అవును 2’ వంటి సినిమాల్లో కూడా నటించాడు. హిందీలో ‘సోనమ్ తేరి కోసం’, ‘పల్టా’ చిత్రాల్లో కనిపించాడు.

బాలీవుడ్ లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య బచ్చన్, మలైకా, అర్జున్ కపూర్, జెనిలియా వంటి స్టార్స్ కరోనాకి గురయ్యారు. అందరూ సులువుగానే కోలుకున్నారు.

 

More

Related Stories